Logo
Download our app
రాజ్యసభ స్థానానికి సీఈసీ షెడ్యూల్
NEWS   Apr 16,2025 01:02 pm
కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏపీలో ఖాళీ అయిన రాజ్య‌స‌భ సీటు కోసం షెడ్యూల్ విడుద‌ల చేసింది. వైసీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానం ప్ర‌స్తుతం ఖాళీగా ఉంది. ఈనెల 22 నుంచి 29 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. 30న నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తారు. ఉప‌స‌హ‌ర‌ణ‌కు మే 2 వ‌ర‌కు గ‌డువు నిర్ణియించారు. మే 9న రాజ్య‌స‌భ స్థానానికి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. ఆరోజే రిజ‌ల్ట్ ప్ర‌క‌టిస్తారు. సంఖ్యా బ‌లం ఆధారంగా కూట‌మికి ఈ సీటు ద‌క్క‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source