Logo
Download our app
అమ‌రావ‌తి నిర్మాణంపై అనుమానాలు వ‌ద్దు
NEWS   Apr 16,2025 12:47 pm
రాజధాని అమరావతిపై కొంత మంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు మంత్రి నారాయ‌ణ‌. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు. భూముల ధర‌లు పెర‌గాలంటే ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న అని అన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని జ‌నాభా పెరుగుతుంద‌న్నారు. ఎయిర్ పోర్ట్ కోసం భూ సేక‌ర‌ణ ఇంకా చేప‌ట్ట లేద‌న్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభ‌మైన‌ట్లు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source