Logo
Download our app
రూ. 500 కోట్ల అవినీతిపై జ‌వాబు చెప్పాలి
NEWS   Apr 16,2025 09:40 am
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో జ‌డ్జి ఇంట్లో దొరికిన రూ. 500 కోట్ల అవినీతిపై ప్ర‌ధాని మోదీ, సీజేఐ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై ఎందుకు మీడియా మౌనంగా ఉందంటూ ప్ర‌శ్నించారు. 1986-1987 మధ్య కాలంలో చిత్రా సుబ్రహ్మణ్యంకు ఆనాడు ప్ర‌భుత్వం ఒణికి పోయింద‌న్నారు. దేశ రాజ‌ధానిలో ఇంత పెద్ద మొత్తంలో నోట్ల క‌ట్ట‌లు దొరికితే ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. అంత డబ్బు ఆ జడ్జి ఇంట్లోకి ఎలా వెళ్ళిందని నిల‌దీశారు. 48 గంటల్లో దేశ ప్ర‌జ‌ల‌కు మ‌న్ కీ బాత్ ద్వారా జ‌వాబు చెప్పాల‌న్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బాగా డబ్బున్నోడన్నారు.
⚠️ You are not allowed to copy content or view source