Logo
Download our app
కాపీయింగ్ పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి
NEWS   Apr 16,2025 09:32 am
విజ‌య‌వాడ ప్ర‌భుత్వ సిద్దార్ధ మెడిక‌ల్ కాలేజీలో ఎంబిబియ‌స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో కాపీయింగ్ జ‌రిగిన‌ ఘటన ప‌ట్ల మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి లోతైన విచార‌ణ జ‌రిపి స‌మ‌గ్ర‌మైన నివేదిక‌ను అంద‌జేయాల‌ని డిఎంఇ డాక్ట‌ర్ న‌ర‌సింహంను ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌కు దారితీసిన వ్య‌వ‌స్థాగ‌త‌, వ్య‌క్తిగ‌త లోపాల‌పై దృష్టి సారించి, ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల్ని తీసుకునే దిశ‌గా నివేదిక ఉండాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source