Logo
Download our app
ఎంపీ స్వంత నిధులతో బోర్ వెల్స్
NEWS   Apr 16,2025 10:56 am
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన స్వంత నిధులతో మంజూరు చేసిన బోర్ వెల్ పనులను మల్యాల మండలం బల్వంతాపూర్ లోని ZPHS పాఠశాలలో, మద్దుట గ్రామంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బింగి వేణు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వేసవికాలంలో నీటి సమస్య రాకుండా ఎంపీ ముందు చూపుతో మండలంలోని బల్వంతాపూర్, తాటిపల్లి, మద్దుట్ల, గొల్లపల్లి గ్రామాల్లో తన స్వంత నిధులతో బోర్ వెల్స్ మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయసింహారావు, హెచ్ఎం శ్యాంసుందర్, ఈఓ కవిత, రవి, పరమేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source