కౌశిక్ రెడ్డిపై రాములు నాయక్ ఫైర్
NEWS Apr 15,2025 04:32 pm
నీలాంటి పైల్వాన్ లను చాలా మందిని చూశానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ రాములు నాయక్. తన కోడలు అక్రమంగా జాబ్ తెచ్చుకుందంటూ చేసిన ఆరోపణలపై స్పందించారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అవసరమైతే విచారణ చేసుకోవచ్చంటూ పేర్కొన్నారు. తన కోడలు కష్టపడి చదువుకుందని, పోస్ట్ సాధించిందన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించారు.