నేను కొంచెం రౌడీ టైప్ - కవిత
NEWS Apr 15,2025 04:23 pm
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. తాను కేసీఆర్ లాగా ఉండనని చెప్పారు. తాను రౌడీ టైప్ అన్నారు. బాన్సువాడలో బీఆర్‌ఎస్ కార్యకర్తలను సతాయించి పోలీస్ స్టేషన్‌లో పెట్టినవాళ్లను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. బెదిరించే అధికారులు, నాయకుల పేర్లను పింక్ బుక్‌లో రాస్తానని, ఎట్టి పరిస్థితుల్లో క్షమించనని అన్నారు. రజతోత్సవ సన్నాహక సమావేశంలో చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.