Logo
Download our app
మే 1 నుంచి జ‌నంలోకి వెళతా - సీఎం
NEWS   Apr 15,2025 04:17 pm
మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్ని పర్యటించేలా కార్యాచరణ ఉండాలని స్ప‌ష్టం చేశారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికి సమయం కేటాయిస్తాన‌ని అన్నారు. సన్న బియ్యం పథకం మన పేటెంట్, బ్రాండ్ అని పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమ‌ని పేర్కొన్నారు. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source