Logo
Download our app
జ‌పాన్ కు సీఎం రేవంత్ ప‌య‌నం
NEWS   Apr 15,2025 09:48 am
జ‌పాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న 8 రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. సీఎంతో పాటు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు, ఇత‌ర అధికారులు ఉన్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో వెళ్లారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో పాల్గొంటారు. టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేస్తారు. స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోర‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source