ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం
NEWS Apr 15,2025 09:14 am
తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు, లక్ష్మణ స్వామి వారికి రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 8.45 నుండి 9.30 గంటల వరకు శ్రీ కోదండ రామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణ స్వామి వారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట (ఆర్‌ఎస్ గార్డెన్స్)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు.