ముగిసిన కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
NEWS Apr 15,2025 08:56 am
ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి. ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగాయి. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. అనంతరం గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని భక్తుల విశ్వాసం .ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.