Logo
Download our app
ధోనీ మ్యాజిక్ ల‌క్నో జెయింట్స్ కు ఝ‌ల‌క్
NEWS   Apr 15,2025 08:45 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫినిష‌ర్ గా పేరు పొందిన సీఎస్కే స్కిప్ప‌ర్ ఎంఎస్ ధోనీ ల‌క్నో ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. మ‌రో వికెట్ ప‌డ‌కుండానే టార్గెట్ ను శివ‌మ్ దూబేతో క‌లిసి ప‌ని పూర్తి చేశాడు. త‌ను కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్స‌ర్ తో విరుచుకు ప‌డ్డాడు. 43 ఏళ్లు అయినా త‌న‌లో ఇంకా చేవ త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. ల‌క్నో నిర్దేశించిన 167 ప‌రుగులను 19.3 ఓవ‌ర్ల‌లోనే పూర్తి చేసింది సీఎస్కే.
⚠️ You are not allowed to copy content or view source