Logo
Download our app
ఎస్పీని సత్కరించిన ఆలయ ఈవో
NEWS   Apr 15,2025 01:05 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా, శాంతియుతంగా పూర్తయినందున ఆలయ ఈవో శ్రీకాంత్ రావు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను సన్మానించారు. జయంతికి విచ్చేసి తమకు సహకరించిన దీక్షాపరులకు, భక్తులకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఆలయ సూపరిండెంట్ సునీల్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source