పంత్ సూపర్ షో..చెన్నై టార్గెట్ 167
NEWS Apr 14,2025 09:28 pm
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 రన్స్ చేసింది. చెన్నై బౌలర్లు కట్టడి చేసినా లక్నో స్కిప్పర్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. 4 ఫోర్లు 4 సిక్సర్లతో 63 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 30 , ఆయుష్ బదోని 22, సమద్ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా , పతిరాణా చెరో రెండు వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్, కాంబోజ్ చెరో వికెట్ తీశారు. లక్నో జోరుకు చెన్నై బ్రేక్ వేస్తుందా వేచి చూడాలి.