అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకోవాలి
NEWS Apr 14,2025 09:31 pm
అంబేడ్కర్ జయంతి సందర్బంగా మల్యాల కేంద్రంలోని అంగడి బజారు నుండి బ్లాక్ చౌరస్తా వరకు దాదాపు 200 బైక్ లతో మండల అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారిని స్మరించుకుని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లిశ్వరి శ్రీనివాస్, ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, అంబేడ్కర్ సంఘ నాయకులు,తదితరులున్నారు.