వలస నేతలకు పదవులు ఇస్తే ఎలా..?
NEWS Apr 14,2025 08:03 pm
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. వలస నేతలకు పదవులు ఇస్తే ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు ఏమై పోవాలని అన్నారు. తనకు హక్కు ఉంది కాబట్టే మంత్రి పదవి ఆశిస్తున్నానని ఇందులో తప్పేముందన్నారు. పార్టీ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వక పోతే ఆదిలాబాద్ జిల్లా అనాథగా మారిపోతుందన్నారు. గత 25 ఏళ్లుగా ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీల కోసం పని చేశానని చెప్పారు. పదవిని ఆశించడం లేదు..కానీ ప్రజల కోసం అడుగుతున్నానని అన్నారు.