టీటీడీ ఈవోపై భూమన ఫైర్
NEWS Apr 14,2025 06:20 pm
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు ఈవో జె. శ్యామల రావుపై. తమ పార్టీ హయాంలో, తాను చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమలలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదం, పాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పుడు ఏదో కొత్తగా ఇస్తున్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.