Logo
Download our app
సుప్రీంలో తెలంగాణ స‌ర్కార్ అఫిడ‌విట్
NEWS   Apr 14,2025 06:09 pm
కంచ గ‌చ్చిబౌలి భూముల‌పై సుప్రీంకోర్టులో తెలంగాణ స‌ర్కార్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈనెల 16న దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ భూముల‌న్నీ ప్ర‌భుత్వానికి చెందిన భూములేన‌ని, అక్క‌డ ఎలాంటి జంతువులు లేవ‌ని పేర్కొన్నారు సీఎస్ శాంతి కుమారి. ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇనిస్టిట్యూట్‌లు, బస్టాండులు ఇలా ఎన్నో వచ్చాయని తెలిపారు. 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయవివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి అడవిలాగా తయారైందని పేర్కొన్నారు. అది అట‌వీ భూమి అని రెవిన్యూ రికార్డుల‌లో కూడా లేదంటూ స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source