గ్రూప్ 1 పరీక్షల స్కాంపై విచారణ జరిపించాలి
NEWS Apr 14,2025 05:06 pm
గ్రూప్ 1 పరీక్షల స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. భారత దేశంలోనే అతి పెద్ద స్కాం చోటు చేసుకుందని ఆరోపించారు. ఒక వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉండే 654 మందికి ఒకటే మార్కులు వచ్చాయని అన్నారు. ఇంకో వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉండే 702 మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు వచ్చాయని, ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.