ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు
NEWS Apr 14,2025 04:53 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. తమకు రూ. 20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా స్పందించడం లేదంటూ యేసుబాబు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ద్వారా అరుంధతి ఆసుపత్రికి 40 మంది సిబ్బందిని కేటాయించామని, ఇందుకు ఎమ్మెల్యే రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకుని కేవలం రూ.30 లక్షలు మాత్రమే ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు.