Logo
Download our app
కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోను
NEWS   Apr 14,2025 03:27 pm
త‌న‌కు అన్యాయం జ‌రిగినా ఊరుకుంటాను కానీ కార్య‌క‌ర్త‌లను ప‌ట్టించుకోక పోతే మాత్రం త‌ట్టుకోలేన‌న్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వారికి పార్టీ అవకాశాలు ఇవ్వాల‌న్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయొద్దంటూ కోరారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్లు ఇప్పుడు మంత్రి పదవి అడుగుతుండ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. నా కార్యకర్తల గొంతు కొస్తే నా వాళ్లందరి గొంతు కోసినట్లేన‌ని అన్నారు. ఇటు పార్టీకి అటు ఆదివాసీలకు అండగా నిలబడ్డ నాకే అన్యాయం చేస్తామంటే ఎలా అని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source