Logo
Download our app
అణ‌గారిన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ క్ష‌మాప‌ణ చెప్పాలి
NEWS   Apr 14,2025 03:20 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. చంపినోళ్లే సంతాప స‌భ‌లు పెట్టినట్లుంది ఆ పార్టీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంటూ ఎద్దేవా చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించింద‌ని, బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అంబేద్కర్ ను ఓడించిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చార‌ని, ఆయ‌న‌కు భార‌త రత్న ఇవ్వ‌కూడ‌ద‌ని అనుకుంద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక అంబేద్క‌ర్ కు ప్ర‌యారిటీ ఇచ్చామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source