Logo
Download our app
బాబా సాహెబ్ అంబేద్క‌ర్ మ‌హ‌నీయుడు
NEWS   Apr 14,2025 01:20 pm
భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ మ‌హ‌నీయుడ‌ని అన్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు ఆదర్శం, ఆచరణీయమని అన్నారు. సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారని, ఆయన ఆశయాలు కొనసాగించడమే ఆ మహనీయుడికి ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. అంబేద్కర్ ప్రేరణతో రాష్ట్రంలో కాంగ్రెస్ సుపరిపాలన అందిస్తోందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source