Logo
Download our app
బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్
NEWS   Apr 14,2025 10:22 am
మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేర‌స్థుడైన వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. త‌మ‌కు అప్ప‌గించాల‌ని కేంద్ర ప్రభుత్వం కోరింది. లండన్ నుండి అప్పగింత కోసం ఎదురు చూస్తున్న మెహుల్ చోక్సీ , అతని మేనల్లుడు నీరవ్ మోడీ క‌లిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 13,500 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై వాంటెడ్‌గా ఉన్నారు. 2018లో దేశం నుంచి పారి పోయాడు. త‌న అరెస్ట్ ను ధ్రువీక‌రించింది సీబీఐ. చోక్సీ వ‌య‌సు 68 ఏళ్లు.
⚠️ You are not allowed to copy content or view source