Logo
Download our app
క‌రుణ్ పోరాడినా ఓడిన ఢిల్లీ క్యాపిట‌ల్స్
NEWS   Apr 14,2025 08:56 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను 12 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఏడేళ్ల త‌ర్వాత తిరిగి ఐపీఎల్ లోకి వ‌చ్చిన క‌రుణ్ నాయ‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కానీ ఇత‌ర ఆట‌గాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ లేక పోయారు. ముంబై బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ తో పాటు ఫీల్డ‌ర్లు అద్భుతంగా ర‌నౌట్లు చేయ‌డంతో ప‌రాజ‌యం పాలైంది ఢిల్లీ త‌న స్వంత గ‌డ్డ‌మీద‌. వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ వేసింది ముంబై ఇండియ‌న్స్.
⚠️ You are not allowed to copy content or view source