వైసీపీలో ముద్రగడకు కీలక పదవి
NEWS Apr 13,2025 09:42 pm
వైసీపీ బాస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు ముద్రగడ పద్మనాభంకు. ఆయనను పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. కొంత కాలంగా పార్టీలో కీలకమైన భూమిక పోషిస్తూ వస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ప్రస్తుతం ఆయన పత్తిపాడు కో ఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు.