ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 206 రన్స్
NEWS Apr 13,2025 09:35 pm
ఐపీఎల్ 2025 లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్ ముందుంచింది. తిలక్ వర్మ 59 రన్స్ తో రెచ్చి పోగా సూర్య కుమార్ యాదవ్ 41 రన్స్ చేయగా రికెల్టన్ 40 రన్స్ చేశారు. రోహిత్ శర్మ 15 పరుగులకే వెనుదిరిగాడు. చివరగా నమన్ ధార్ 17 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ , విప్ రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు తీయగా ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీశాడు.