వైభవోపేతం శ్రీ కోదండ రాముడి ఉత్సవం
NEWS Apr 13,2025 09:35 pm
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాళీయ మర్దనాలంకారంలో స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రాములవారి ఉత్సవ మూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.