Logo
Download our app
ఆర్సీబీ విక్ట‌రీ రాజ‌స్థాన్ ఓట‌మి
NEWS   Apr 13,2025 08:52 pm
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా జైపూర్ స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. 174 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెన‌ర్ సాల్ట్ సూప‌ర్ షో చేశాడు. 65 ప‌రుగుల‌తో చెల‌రేగి పోగా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ 62 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. దేవవ‌త్ ప‌డిక్క‌ల్ 40 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రెండో వికెట్ కు సాల్ట్ , కోహ్లీ క‌లిసి 83 ప‌రుగులు జోడించారు. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది నాలుగో విజ‌యం కావ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source