Logo
Download our app
కావ్య మార‌న్ వైర‌ల్
NEWS   Apr 13,2025 02:41 am
స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఓన‌ర్ కావ్య మార‌న్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు. ఐపీఎల్ 2025 మెగా టోర్నీ హాట్ ఫెవ‌రేట్ గా ఉన్న త‌మ జ‌ట్టు అనూహ్యంగా చ‌తికిల ప‌డింది. తొలి మ్యాచ్ లో రాజ‌స్థాన్ పై గెలిచిన ఎస్ఆర్ హెచ్ వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో ఓడి పోయింది. ఇవాళ జ‌రిగిన కీల‌క పోరులో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌త్యేకించి అభిషేక్ శ‌ర్మ 141 ప‌రుగుల‌తో రెచ్చి పోయాడు. 8 వికెట్ల తేడాతో గెలుపొంద‌డంతో చిన్న పిల్ల‌లా సంతోషాన్ని వ్య‌క్తం చేసింది కావ్య మార‌న్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source