బీఆర్ఎస్ వరంగల్ సభకు లైన్ క్లియర్
NEWS Apr 13,2025 02:12 am
బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఈనెల 27న తలపెట్టనున్న పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు స్పందించడంతో వరంగల్ పోలీసులు దిగి వచ్చారు. ఈ మేరకు సభకు అనుమతి ఇస్తూ పోలీసులు పర్మిషన్ లెటర్ ను బీఆర్ఎస్ నేతలకు అందజేశారు. పత్రాన్ని తీసుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితెల సతీష్, మాజీ కార్పొరేషన్ ఛైర్మెన్ వాసుదేవ రెడ్డి ఉన్నారు. దీంతో కోర్టులో కేసును ఉపసంహరించు కోనుంది బీఆర్ఎస్.