సీనియర్ జర్నలిస్ట్ పరకాలకు పురస్కారం
NEWS Apr 12,2025 08:38 pm
నవభారత్ నిర్మాణ సంఘం - పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో , డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ వరకాల యాదగిరికి అల్లూరి సీతారామరాజు స్మారక పురస్కారాన్ని ప్రధానం చేశారు. రవీంద్రభారతిలో ఏర్పాటైన కార్యక్రమంలో పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి చేతుల మీదుగా యాదగిరిని ఘనంగా సన్మానించి జ్ఞాపిక, నగదు పురస్కారంతో అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎం. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.