Logo
Download our app
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసేందుకు కుట్ర
NEWS   Apr 13,2025 02:00 am
టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు నిప్పులు చెరిగారు. టీటీడీని అప్ర‌తిష్టపాలు చేసేందుకు వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. మనుగడ కోల్పోతున్న పార్టీని బతికించు కోవడానికి నిత్యం ఏదో ఒక బూటకపు మాటలతో పబ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. టీటీడీ మాజీ చైర్మ‌న్ క‌రుణాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. చని పోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదన్నారు. గోశాలలోని 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజూ పర్యవేక్షించడం జరుగుతోంద‌న్నారు. 100 ఆవులు చని పోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్త‌వ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source