గుజరాత్ టైటాన్స్ కు లక్నో ఝలక్
NEWS Apr 13,2025 01:54 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ కు కోలుకోలేని షాక్ తగిలింది. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఝలక్ ఇచ్చింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. వరుసగా విజయం సాధించాలన్న శుభ్ మన్ గిల్ ఆశలపై నీళ్లు చల్లింది లక్నో. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 180 రన్స్ కే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దుమ్ము రేపారు. నికోలస్ పూరన్ 61 రన్స్ చేయగా ఎడెన్ మార్కరమ్ 58 తో చెలరేగారు.