Logo
Download our app
అభిషేక్ విధ్వంసం హైద‌రాబాద్ విజ‌యం
NEWS   Apr 13,2025 01:50 am
వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు జూలు విదిల్చింది. ఉప్ప‌ల్ లో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు చుక్క‌లు చూపించింది. అభిషేక్ శ‌ర్మ ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌న‌తో పాటు ట్రావిస్ హెడ్ కూడా జోరు పెంచాడు. షాన్ దార్ సెంచ‌రీతో ఎస్ ఆర్ హెచ్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. 245 ప‌రుగుల భారీ టార్గెట్ ను అవ‌లీల‌గా సాధించింది. విస్తు పోయేలా చేసింది. ట్రావిస్ హెడ్ 66 ర‌న్స్ చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి 171 ర‌న్స్ జోడించారు. క్లాసెన్ 21 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 2వ విజ‌యాన్ని న‌మోదు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source