Logo
Download our app
పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ది రోడ్డు ప్ర‌మాదం
NEWS   Apr 12,2025 06:07 pm
ఏపీలో సంచ‌ల‌నం రేపిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల హ‌త్య‌కు సంబంధించి విచార‌ణ పూర్త‌యింద‌ని వెల్ల‌డించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ఆయ‌న బుల్లెట్ పై స్పీడ్ గా రావ‌డంతో అదుపు త‌ప్పి ప‌డి పోయార‌ని, రాళ్ల‌పై ప‌డ్డార‌ని తెలిపారు. 2 వారాల పాటు సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టామ‌న్నారు. మొత్తం 113 మంది సాక్షుల‌ను విచారించామ‌ని చెప్పారు. పాస్ట‌ర్ ప్ర‌వీణ్ గ‌తంలో మ‌ద్యం సేవించిన‌ట్లు ఆధారాలు ఉన్నాయ‌ని అన్నారు. సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారం చేస్తున్న 11 మందిపై కేసులు న‌మోదు చేశామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source