Logo
Download our app
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా..రాహుల్ కు షాక్
NEWS   Apr 12,2025 05:24 pm
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్ గాంధీల‌కు షాక్ త‌గిలింది. వారికి సంబంధించిన ఆస్తుల‌ను ఈడీ స్వాధీనం చేసుకోవ‌డం ప్రారంభించింది. ఈనెల 11న ఢిల్లీ, ముంబై, ల‌క్నో లోని రిజిస్ట్రార్ల‌కు నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియన్, రూ.2,000 కోట్లకు పైగా విలువైన AJL ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు స్వాధీనం చేసుకున్నట్లు కనుగొన్న తర్వాత PMLA సెక్షన్ 8 కింద ఈ చర్య తీసుకున్న‌ట్లు ఈడీ స్ప‌ష్టం చేసింది. ఈ ఒప్పందం ద్వారా రూ. 988 కోట్లు అక్ర‌మంగా త‌ర‌లించారంటూ ఆరోపించింది. 2014లో బీజేపీకి చెందిన సుబ్ర‌మ‌ణ్య స్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దాఖ‌లైంది.
⚠️ You are not allowed to copy content or view source