పాకిస్థాన్‌లో భూకంపం
NEWS Apr 12,2025 04:58 pm
పాకిస్తాన్ లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.8 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఇస్లామాబాద్ సమీపంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. భూమికి 10 కి.మీ లోతులో భూకంపం చోటు చేసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా వివరాలు రాలేదు.