Logo
Download our app
కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి
NEWS   Apr 12,2025 04:50 pm
అంబేద్కర్ ని అవమానించి, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ‌. అంబేద్కర్ ఆలోచనలను ఒక సంకల్పం గా భావించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు 13వ తేదీ నుంచి 25వ తేదీ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింద‌న్నారు. ఇందులో భాగంగా ఏపీ పార్టీ కార్యాల‌యంలో శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై అనేక ఆరోపణలు చేసిందన్నారు. కానీ జ‌నం న‌మ్మ‌లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source