Logo
Download our app
కోల్ క‌తా అదుర్స్ చెన్నై కింగ్స్ బేవార్స్
NEWS   Apr 12,2025 07:35 am
చెన్నై చేపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. సీఎస్కేను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 103 ర‌న్స్ చేసింది. కోల్ క‌తా బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 57 డాట్ బాల్స్ వేయ‌డం విశేషం. \ర‌చిన్ ర‌వీంద్ర 4, కాన్వే 12, త్రిపాఠి 16, విజ‌య్ శంక‌ర్ 29 , శివ‌మ్ దూబే 31, అశ్విన్1, జ‌డేజా , హూడా డ‌కౌట్ అయ్యారు. ఇక కేకేఆర్ బౌల‌ర్ల‌లో అలీ 1, సునీల్ న‌రైన్ 3, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 2, హ‌ర్షిత్ రాణా 2 వికెట్లు తీశాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన కేకేఆర్ 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి టార్గెట్ ఛేదించింది. సునీల్ స‌రైన్ రెచ్చి పోయాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 44 ర‌న్స్ చేశాడు. చెన్నైకి ఇది వ‌రుస‌గా ఐదో ఓట‌మి కావ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source