Logo
Download our app
భారతీ రెడ్డి మీద కామెంట్స్ బాధాక‌రం
NEWS   Apr 11,2025 05:04 pm
త‌న వ‌దినె వైఎస్ భార‌తీ రెడ్డిని ఉద్దేశించి సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన కామెంట్స్ ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అన్నారు. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేద‌న్నారు.. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్నారు.ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాల్సిందే న‌న్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, తెలుగుదేశం పార్టీలేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source