Logo
Download our app
మిస్ వ‌ర‌ల్డ్ ఆతిథ్యానికి చౌమొహ‌ల్లా ప్యాలెస్
NEWS   Apr 11,2025 04:40 pm
అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మిస్ వ‌ర‌ల్డ్ 2025 పోటీల‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది హైద‌రాబాద్ న‌గ‌రం. దీంతో ఈ సిటీకి ఎక్క‌డా లేనంత‌టి ప్ర‌యారిటీ ల‌భిస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా 2 వేల‌కు పైగా మీడియా ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. వ్యాపార‌, వాణిజ్య‌, కార్పొరేట్ కంపెనీల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు ఇక్క‌డికి రానున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యుల‌కు హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క స్థ‌లం చౌమొహ‌ల్లా ప్యాలెస్ ను సిద్దం చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్.
⚠️ You are not allowed to copy content or view source