Logo
Download our app
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
NEWS   Apr 11,2025 04:41 pm
మెట్ పల్లి పట్టణంలోని బర్కత్ పుర యూత్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మదీన మస్జిద్ లో జుమ్మా నమాజ్ తర్వాత నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా మత స్వేచ్చ సమానత్వానికి హామీ ఇచ్చే రాజ్యాంగంలోని 14, 25, 26 ఆర్టికల్స్ ను నేరుగా ఉల్లంఘించడమే అవుతుందని, దీని ద్వారా ముస్లింల మతపరమైన స్వేచ్చలో జోక్యం చేసుకోవడం, ముస్లింల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వాపోయారు.
⚠️ You are not allowed to copy content or view source