Logo
Download our app
టీటీడీ మాజీ చైర్మ‌న్ షాకింగ్ కామెంట్స్
NEWS   Apr 11,2025 02:14 pm
టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గోవులు మృతి చెందాయ‌ని, ఆ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారంటూ మండిప‌డ్్డారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన వాళ్లంతా ఏమయ్యారంటూ ప్ర‌శ్నించారు. త‌మ‌ హయాంలో దాదాపు 550 ఆవులను దాతల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చామ‌న్నారు. ఆ ఆవులు ఇచ్చే 15 వేల లీటర్ల పాలతో నిత్యం వేంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదం కోసం వాడామ‌న్నారు. కానీ ఇప్పుడు ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఇతర గోవుల పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source