Logo
Download our app
రేపు వైన్ షాపులు బంద్
NEWS   Apr 11,2025 09:52 am
తెలంగాణలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్ ల‌లో 12వ తేదీన వైన్ షాపులు మూసి వేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాల‌ని ఆదేశించారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source