Logo
Download our app
గ‌చ్చిబౌలి భూముల‌పై ముగిసిన క‌మిటీ అధ్య‌య‌నం
NEWS   Apr 11,2025 09:44 am
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక క‌మిటీ అధ్య‌య‌నం చేసింది. కోర్టు ఆదేశాల మేర‌కు ఈనెల 16 లోపు పూర్తిగా నివేదిక అంద‌జేయ‌నుంది. హైదరాబాద్లో రెండు రోజులు పాటు క‌మిటీ ప‌ర్య‌టించింది. తొలిరోజు సచివాలయంలో సిఎస్ శాంతి కుమారితో స‌హా ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయ్యింది. రెండో రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించింది. విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, యూనివర్సిటీ విసీ, రాజకీయ పార్టీలతో విడివిడిగా వరస సమావేశాలు నిర్వ‌హించింది క‌మిటీ. రెండు గంటల పాటు సుదీర్ఘంగా యూనివర్సిటీలో క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించింది.
⚠️ You are not allowed to copy content or view source