Logo
Download our app
అంగ‌రంగ వైభవంగా రాములోరి ఉత్స‌వాలు
NEWS   Apr 10,2025 07:10 pm
టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి ఆల‌యాన్ని గురువారం సంద‌ర్శించారు. గ‌త కొన్ని రోజులుగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ఈనెల 11న శుక్ర‌వారం స్వామి వారి ఆల‌యంలో సీతా రామ కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. ఆల‌య ఏర్పాట్ల‌ను బీఆర్ నాయుడు ప‌రిశీలించారు. సంతృప్తిని వ్య‌క్తం చేశారు. సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌భుత్వం తర‌పున శ్రీ సీతారాముల స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source