Logo
Download our app
వారం రోజులుగా ఆర్ఐ లేడు
NEWS   Apr 10,2025 02:37 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రం లోని రెవెన్యూ శాఖ కార్యాలయంలో ఆర్ఐ లేకపోవడం వల్ల రాజీవ్ యువ వికాసం దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుకు గడువు కొన్ని రోజులు పొడిగించింది. రెవెన్యూ శాఖ నుంచి కులం, నివాసం, ఆదాయం, ఈబీసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో ప్రథమంగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ సంతకం చేసే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారం రోజుల నుంచి లేక పోవడంతో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source