Logo
Download our app
అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు
NEWS   Apr 10,2025 10:08 am
రాష్ట్రంలో వాహ‌న‌దారుల‌కు షాక్ ఇచ్చింది ర‌వాణా శాఖ‌. అన్ని వాహ‌నాల‌కు హై సెక్యూరిటీ నెంబ‌ర్ ప్లేట్లు ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు జీవో జారీ చేసింది. 01.04.2019కి ముందు నమోదైన అన్ని వాహనాలకు HSRP తప్పనిసరి అని స్ప‌ష్టం చేసింది. హెచ్ ఎస్ ఆర్ పీ ని అమ‌ర్చుకునేందుకు గ‌డువు ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కే ఇచ్చిన‌ట్లు తెలిపింది. గడువు మించితే వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. వాహన యజమానులు http://siam.in వెబ్‌సైట్‌ ద్వారా HSRP బుక్ చేసుకోవాల‌ని సూచించింది.
⚠️ You are not allowed to copy content or view source