Logo
Download our app
అమ‌రావ‌తి..హైద్రాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే
NEWS   Apr 09,2025 04:37 pm
కేంద్ర స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అమ‌రావ‌తి - హైద‌రాబాద్ మ‌ధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకి ప‌చ్చ జెండా ఊపింది. విభజన చట్టం అపరిష్కృత అంశాలపై దృష్టి సారించింది కేంద్రం. డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖ ఆదేశించింది. దీంతో త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్ర రోడ్లు-ఉపరితల రవాణా, బొగ్గు గనులు, ఉక్కు, వ్యవసాయ, రైల్వే, పెట్రోలియం తదితర శాఖల ఉన్నత అధికారులతో సమీక్షించారు.
⚠️ You are not allowed to copy content or view source